Madrid Open | మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్‌లో నార్వే సంచలనం కాస్పర్ రూడ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రూడ్ 7-5, 3-6, 6-4తో జాక్ డ్రేపర్‌పై అద్భుత విజయం సాధించాడు. తద్వారా మాస్టర్స్ 1000 టైటిల్ గెలిచిన తొలి నార్వే ప్లేయర్‌గా రూడ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
తొలి సెట్‌ను 7-5తో కైవసం చేసుకున్న రూడ్‌కు రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి చుక్కెదురైంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో పుంజుకున్న రూడ్ అద్భుతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో మ్యాచ్‌ను తన వశం చేసుకున్నాడు.