SL vs RSA టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా(South Africa) పేసర్ అన్రిచ్ నోర్జి(4/7) నిప్పలు చెరిగాడు. స్వింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బుల్లెట్ బంతులతో ప్రధాన వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నోర్జి సూపర్ స్పెల్‌తో లంక 70కే 8 వికెట్లు కోల్పోయింది. మరో స్పీడ్‌స్టర్ కగిసో రబడ(2/21), స్పిన్ ఆల్‌రౌండర్ కేశవ్ మహరాజ్(2/22)లు కూడా ఓ చేయి వేయడంతో లంక 77 పరుగులకే పరిమితమైంది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(19), ఏంజెలో మాథ్యూస్(16)లు టాప్ స్కోరర్‌గా నిలిచారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంకు ఆదిలోనే పేసర్ బార్ట్‌మన్ షాకిచ్చాడు. డేంజరస్ పథుమ్ నిస్సంకను ఔట్ చేసి సఫారీ జట్టుకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్(19), కమిందు మెండిస్(11)లు కాసేపు ప్రతిఘటించారు. అయితే.. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడినీ అన్రిచ్ నోర్జి పెవిలియన్ పంపి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సైతం తిప్పేయడంతో లంక 40కే సగం వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే అసలంక(6)ను నొర్జి పెవిలియన్ పంపడంతో లంక ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో మాజీ సారథి దసున్ శనక(9), సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెల్ మాథ్యూస్(16)లు ధనాధన్ ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నారు. మార్కోజాన్సెన్ థీక్షణను ఔట్ చేయడతో 77 పరుగులకే లంక ఆలౌటయ్యింది.
An American horror story for Sri Lanka!
Their lowest total in men’s T20Is 😱https://t.co/W3n1vgDZNs | #SLvSA | #T20WorldCup pic.twitter.com/H4D0hYsbBq
— ESPNcricinfo (@ESPNcricinfo) June 3, 2024