కాన్బెర్రా: భారత టీ20 జట్టు సారథ్య పగ్గాలు చేపట్టాక స్థాయికి తగ్గ ఆట ఆడటంలో విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు హెడ్‌కోచ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. సూర్య బ్యాటింగ్ ఫామ్‌పై తనకు ఆందోళన లేదని అన్నాడు.
బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో మొదలుకాబోయే టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ మాట్లాడుతూ.. ‘వాస్తవంగా చెప్పాలంటే సూర్య ఫామ్ గురించి నాకు ఆందోళనేమీ లేదు. మేం దూకుడుగా ఆడాలని నిశ్చయించుకున్నాం’ అని అన్నాడు.