ఇన్నాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు ఇండియా ఆడే మ్యాచ్‌లు డిస్నీ హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమయ్యేవి. ఇంగ్లండ్‌తో ఇటీవలే ముగిసిన మూడు వన్డేల సిరీస్ సోనీ లివ్‌లో వచ్చింది. మరి ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆడబోయే వన్డే మ్యాచ్‌లు పైన పేర్కొన్న రెండు ఛానెళ్లతో పాటు ఏ ప్రైవేట్ ఛానెల్లో కూడా రావు. అసలు ప్రైవేట్ శాటిలైట్ ఛానెళ్లలో విండీస్-ఇండియా మ్యాచ్ చూడటం కుదరని పని. మరెలా..?
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ దేశంలో ఆడబోయే మ్యాచులన్నింటినీ ప్రసారం చేయడానికి FanCode అనే యాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఫ్యాన్ కోడ్ అనేది ఆ బోర్డుకు అధికారిక ప్రసారదారు. ఇదొక Sports OTT ఛానెల్. వెస్టిండీస్ స్వదేశంలో ఆడే మ్యాచులన్నీ ఇందులోనే ప్రసారమవుతాయి. ఈ మేరకు ఫ్యాన్ కోడ్.. విండీస్ బోర్డుతో గతేడాది ఒప్పందం (2024 వరకు) కుదుర్చుకుంది.
భారత్‌లో అయితే..
ప్రైవేట్ శాటిలైట్ ఛానెళ్లు లేకపోవడంతో భారత్ లోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లను ప్రభుత్వ అధికారిక ప్రసారదారు దూరదర్శన్‌లో వీక్షించొచ్చు. DD Sports 1.0 లో ఈ మ్యాచ్‌లను చూసే వీలుంది. ఈ మేరకు ఫ్యాన్ కోడ్-డీడీ స్పోర్ట్స్‌తో జతకలిసింది. ఈ ఒప్పందంలో భాగంగా యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 75:25 నిష్పత్తిలో పంచుకునేందుకు ఒప్పందం కుదిరింది.
వెస్టిండీస్-ఇండియా వన్డే సిరీస్ షెడ్యూల్ :