తన అద్భుతమైన పేస్‌తో అందరినీ ఆకట్టుకొని భారత జట్టుకు ఎంపికైన జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐద టీ20ల సిరీస్‌లో సెలెక్ట్ అయిన అతనికి ఇంకా భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. అదే సమయంలో సఫారీ పేసర్ ఆన్రిచ్ నోర్జీతో ఉమ్రాన్‌ను పోలుస్తున్నారు నెటిజన్లు. ఇద్దరూ మంచి పేసర్లు అవడం, తమ వేగంతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే వాళ్లు కావడంతో ఇలా పోలికలు తెస్తున్నారు.
అయితే ఈ పోలికలను తాను అసలు పట్టించుకోవడం లేదని సఫారీ పేసర్ చెప్పాడు. ‘‘మా ఇద్దరిలో ఫాస్టెస్ట్ బౌలర్ ఎవరనే విషయం గురించి అసలు ఆలోచించడం లేదు. జట్టుకు ఎవరు ఎక్కువగా ఉపయోగపడ్డారనేదే ముఖ్యం. కానీ ట్రైనింగ్ చేసే సమయంలో మాత్రం ఇంకా వేగం ఎలా పెంచాలని ఆలోచిస్తాం. దాన్ని బట్టి ట్రైనింగ్‌లో మార్పులు చేసుకుంటాం’’ అని నోర్జీ వివరించాడు.