సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 12, 2021 , 01:43:24

వెస్టిండీస్‌ 223/5

వెస్టిండీస్‌ 223/5

ఢాకా: బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో వెస్టిండీస్‌ నిలకడగా ఆడుతున్నది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బూనర్‌ (74 బ్యాటింగ్‌) అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ (47), క్యాంప్‌బెల్‌ (36) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో అబు జాయేద్‌, తైజుల్‌ ఇస్లామ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బూనర్‌తో పాటు జోషువా డా సిల్వా (22) క్రీజులో ఉన్నాడు. 

VIDEOS

logo