Perth Test : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా తొలి టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయినప్పటికీ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (4/17) విజృంభణతో ఆస్ట్రేలియాను ఆలౌట్ ప్రమాదంలో పడేసింది. అనుకున్నట్టే పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించగా.. ఇరుజట్ల స్పీడ్స్టర్లు రెచ్చిపోయారు. ఇంకేముంది ఒక్కరోజే 17 వికెట్లు పడ్డాయి.
ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడిన చోట తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(41), వికెట్ కీపర్ రిషభ్ పంత్(37)లు అద్భుత పోరాటం కనబరిచారు. అనంతరం కంగారూ టాపార్డర్‌ను బుమ్రా దెబ్బకొట్టాడు. అతడిని అనుసరిస్తూ మహ్మద్ సిరాజ్(2/17) కూడా విజృంభించడంతో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.
Captain gets Captain 👏
Skipper Jasprit Bumrah has FOUR!
Pat Cummins departs for 3.
Live – https://t.co/gTqS3UPruo#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/rOkGVnMkKt
— BCCI (@BCCI) November 22, 2024
పెర్త్ మైదానంలో పేసర్ల జోరు చూపించారు. ఆతిథ్య జట్టు బౌలర్లకు దీటుగా భారత పేసర్లు రాణించగా ఆస్ట్రేలియా ఎదురీదుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ తీసుకున్నాడు. రెండో ఓవర్లోనే మిచెల్ స్టార్క్(2/14) డేంజరస్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0)ను డకౌట్ చేశాడు. ఆ కాసేపటికే దేవ్‌దత్ పడిక్కల్()ను సున్నాకే ఔట్ చేసి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. కంగారూ పేసర్లు చెలరేగుతున్నా కేఎల్ రాహుల్ (26) నింపాదిగా ఆడాడు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన విరాట్ కోహ్లీ(5)ని హేజిల్‌వుడ్ బౌన్స్‌తో ఓబల్తా కొట్టించాడు. అంతే.. నాలగు వికెట్లు పడ్డాయి. ఆ దశలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(41) రిషభ్ పంత్(37) చెక్కుచెదరని ఏకాగ్రతతో ఆడారు. దాంతో, భారత జట్టు 150 పరుగులు చేయగలిగింది.
అనంతరం ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆసీస్‌కు బుమ్రా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(8), నాథన్ మెక్‌స్వీనే(10)లను ఔట్ చేసి భారత్‌కు బ్రేకిచ్చాడు. మార్నస్ లబూషేన్(2)ను ఔట్ చేసిన సిరాజ్ కంగారూలను మరింత కష్టాల్లో పడేశాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(19 నాటౌట్) ఒంటరిపోరాటం చేయగా ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కమిన్స్ సేన ఇంకా 83 పరుగులు వెనకబడే ఉంది.