ముంబై: ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారనే కారణంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణాకు ఐపీఎల్ నిర్వాహకులు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఇదే కారణంతో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మందలించారు. ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశలో బుధవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీశ్, బుమ్రా లెవల్-1 ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించారని మ్యాచ్ రిఫరీ గుర్తించారు. నితీశ్, బుమ్రా తమ తప్పులు అంగీకరించడంతో రిఫరీ చర్యలు తీసుకున్నారు. నితీశ్‌కు మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించగా.. బుమ్రాను మందలించి వదిలేశారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.