Nithish Reddy | ముంబై: తెలుగు యువ క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డికి భారత జట్టులో చోటు దక్కిన ఆనందం రెండ్రోజుల్లోనే ఆవిరైంది. జూలైలో జరిగే జింబాబ్వే పర్యటనకు ఎంపికైన అతడు గాయం కారణంగా ఈ టూర్ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. నితీశ్ స్థానంలో శివమ్ దూబేను జట్టులోకి ఎంపిక చేసింది. నితీశ్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడని, నాలుగు వారాల్లో కోలుకుంటాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఐసీసీ టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్
దుబాయ్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యానికి ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెక్ పెట్టాడు. ఏడాది కాలంగా టీ20లలో నిలకడైన ప్రదర్శనలతో రాణిస్తూ ఐసీసీ పురుషుల టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యను తాజాగా హెడ్ అధిగమించాడు.
బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకులలో 844 రేటింగ్ పాయింట్స్‌తో హెడ్ టాప్‌ర్యాంక్ కైవసం చేసుకోగా 842 పాయింట్లతో సూర్య రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ఫిల్ సాల్ట్, బాబర్, రిజ్వాన్ టాప్-5లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో అదిల్ రషీద్ (ఇంగ్లండ్) అగ్రస్థానంలో ఉండగా ఆల్రౌండర్లలో వనిందు హసరంగ మొదటి స్థానాలను దక్కించుకున్నారు.