అడిలైడ్: అడిలైడ్ టెస్టులో ఇండియన్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy).. రివర్స్ స్ట్రోక్‌తో సిక్సర్ కొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్ బోలాండ్ బౌలింగ్‌లో స్టన్నింగ్ షాట్‌తో నితీశ్ ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ 42వ ఓవర్లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. థార్డ్మాన్ దిశగా ఆ బంతి గాలిలో వెళ్లింది. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న బుమ్రా ఆ షాట్ ఆడిన తీరు చూసి నవ్వేశాడు. నితీశ్ 42 రన్స్ చేసి ఔటయ్యాడు. జట్టులో అత్యధికంగా అతనే పరుగులు చేశాడు. ఇండియా 180కి ఆలౌటైంది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 86 రన్స్ చేసింది.
THIS IS CINEMA! 🙌
Pink ball, seaming conditions & bowlers breathing fire – doesn’t matter to #NitishReddy! 💪#AUSvINDOnStar 2nd Test 👉 LIVE NOW on Star Sports! #AUSvIND | #ToughestRivalry pic.twitter.com/IM9HaBrv63
— Star Sports (@StarSportsIndia) December 6, 2024