హైదరాబాద్, ఆట ప్రతినిధి: బాకు (అజర్బైజాన్) వేదికగా ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్న ఎఫ్ఐజీ జిమ్నాస్టిక్స్ ప్రపంచ చాంపియన్షిప్నకు తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిశికా అగర్వాల్ ఎంపికైంది.
గత కొన్ని నెలలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న నిశిక..తాజాగా భారత జిమ్నాస్టిక్స్ జట్టులో చోటు దక్కించుకుంది. స్థానిక గాడియం స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నిశిక..మెగాటోర్నీలో సత్తాచాటాలన్న పట్టుదలతో ఉంది. ప్రపంచకప్లో నిశిక ప్రాతినిధ్యం పట్ల తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం హర్షం వ్యక్తం చేసింది.