ముంబై: పిన్న వయసులో ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌పై ఓవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే మరోవైపు పన్నులు వెంటాడుతున్నాయి. డింగ్ లిరెన్‌పై అద్భుత విజయంతో మెగాటోర్నీలో విజేతగా నిలిచిన గుకేశ్‌కు ప్రైజ్‌మనీ కింద 11.34 కోట్లు దక్కాయి. దీనిపై సోషల్‌మీడియాలో సెటైర్లు నవ్వులు తెప్పిస్తున్నాయి. గుకేశ్ విజయం..
ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్కు శుభాకాంక్షలు అంటూ సందేశాలు రాసుకొస్తున్నారు. ప్రైజ్‌మనీ కింద 11 కోట్లకు దాదాపు 5 కోట్ల మేర గుకేశ్ వద్ద పన్ను వసూలు చేస్తున్నారంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష్యంగా మెస్సెజ్‌లు పెడుతున్నారు. టీడీఎస్ అం టే ‘ట్యాక్స్ డిడక్టెడ్ బై సీతారామన్’ అంటూ కొత్త నిర్వచనం ఇస్తున్నారు. గుకేశ్ గెలుపు ప్రభుత్వానికి పన్ను అన్న రీతిలో సెటైర్లతో సోషల్‌మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు.