అస్తానా: పారిస్ ఒలింపిక్స్‌కు ముందు తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అదరగొడుతోంది. అస్తానా(కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భాగంగా గురువారం ముగిసిన 52 కిలోల సెమీస్‌లో నిఖత్ 5-0 తేడాతో కజకిస్థాన్ బాక్సర్ తోమిరిస్ మైర్జకుల్పై ఏకపక్ష విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
నిఖత్‌తో పాటు మీనాక్షి (48 కిలోలు) 5-0తో గుల్నాజ్ను ఓడించగా మనీషా (60 కిలోలు) 5-0తో కజకిస్థాన్కే చెందిన టంగతర్ అస్సెమ్ను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించింది. 50 కిలోల విభాగంలో అనామిక ఫైనల్‌కు చేరింది. శుక్రవారం అభిషేక్ యాదవ్, వైశాల్, గౌరవ్, యైఫబ సింగ్ సెమీస్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.