Football Players | ట్రిపోలి (లిబియా) : నైజీరియా ఫుట్బాల్ జట్టు ఆటగాళ్లకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆఫ్రికా నేషన్స్ కప్లో భాగంగా రెండు మ్యాచ్ల సిరీస్ కోసం లిబియాలోని బెంఘాజీకి బయల్దేరిన నైజీరియా ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానానికి లిబియా అనుమతి నిరాకరించింది. దీంతో బెంఘాజీకి 240 కిలోమీటర్ల దూరంలోనే వాళ్లు ఆగిపోవాల్సి వచ్చింది. అల్ అబ్రాక్ విమానాశ్రయంలో తిండీ, నిద్ర లేకుండా రాత్రంతా పడిగాపులు కాశారని, తమ విమాన అనుమతి కోసం 16 గంటల పాటు వేచి చూశారని నైజీరియా తెలిపింది. తమకు ఇంత అవమానం కలిగించిన లిబియాకు తగిన గుణపాఠం చెబుతామని, ఆ దేశంతో సాకర్ మ్యాచ్ ఆడబోమని నైజీరియా సాకర్ జట్టు తేల్చి చెప్పింది.