ODI World Cup : మహిళల వరల్డ్ కప్ పోటీలకు రెండోసారి అర్హత సాధించిన బంగ్లాదేశ్ నిగర్ సుల్తానా (Nigar Sultana) సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఉపఖండంలో మెగా టోర్నీ జరుగునున్న నేపథ్యంలో సెలెక్టర్లు స్పిన్నర్లకు ప్రాధాన్యం ఇస్తూ స్క్వాడ్‌ను ప్రకటించారు. సుల్తానా కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని శనివారం ఎంపిక చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు నహిద్ అక్తర్, లెగ్ స్పిన్నర్ ఫహిమా ఖాతూన్‌తో పాటు షొర్నా అక్తర్, మరుఫా అక్తర్‌లు స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.
దేశవాళీలో అద్భుతంగా రాణించిన వికెట్ కీపర్ రుబియా హైదర్ ( Rubya Haider ) సైతం బెర్తు సాధించింది. వరల్డ్ కప్‌తో ఈ యంగ్‌స్టర్ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. తొలిసారి 2022లోవన్డే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించిన బంగ్లా ఏడో స్థానంతో నిరాశపరిచింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. అయితే.. బంగ్లాదేశ్ మ్యాచులన్నీ లంకలో జరగనున్నాయి. అక్టోబర్ 2 న తమ తొలి పోరులో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది నిగర్ సుల్తానా సేన.
The Bangladesh Cricket Board has unveiled the 15-member squad for the ICC Women’s Cricket World Cup 2025! 🏏🇧🇩 Led by skipper Nigar Sultana Joty and vice-captain Nahida Akter, the squad is ready to roar in India & Sri Lanka from Sept 30 – Nov 2. 💪🔥
Bangladesh Squad:
Nigar… pic.twitter.com/pm58dMjxxZ— Bangladesh Cricket (@BCBtigers) August 23, 2025
బంగ్లాదేశ్ స్క్వాడ్ : నిగర్ సుల్తానా జొటే(కెప్టెన్), నహిదా అక్తర్, ఫర్జానా హక్, రుబియా హైదర్, షర్మిన్ అక్తర్ సుప్తా, శోభన మొస్తరీ, రితూ మోనీ, షోర్నా అక్తర్, ఫహిమా ఖాతూన్, రబెయా ఖాన్, మరుఫా అక్తర్, ఫరిహ ఇస్లాం, షంజిద అక్తర్, నిశితా అక్తర్, సుమైయా అక్తర్.