హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ పై న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ విధించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో నెదర్లాండ్స్ చతికిల పడింది. 223 పరుగులకే నెదర్లాండ్స్ ఆలౌట్ అయింది. కొలిన్ అకెర్మాన్ 69 పరుగులు చేయగా, మిగతా వారిలో స్కాట్ ఎడ్వర్డ్స్ 30, సిబ్రాండ్ ఎంగిల్ బ్రెచ్ట్ 29, తేజ నిడమనూరు 21, మ్యాక్స్ ఔడెడ్ 16, విక్రమ్ జిత్ సింగ్ 12, బాస్ డీ లీడే 18 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ మిచెల్ శాంటర్న్ చెలరేగిపోయాడు. 59 పరుగులకే ఐదు వికెట్లు పుచ్చుకుని నెదర్లాండ్స్ వెన్ను విరిచాడు. మ్యాట్ హెన్రీ మూడు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడిపోవడంలో బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర 51, విల్ యంగ్ 70, టామ్ లాథమ్ 53 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లు వాన్ డెర్ మెర్వ్, వాన్ మీకెరెన్, ఆర్యన్ దత్ రెండు వికెట్లు, బాస్ డీ లీడె ఒక వికెట్ తీశాడు.