ODI World Cup 2023 : న్యూజిలాండ్ జట్టు(Newzealand) కొత్త జెర్సీతో వన్డే వరల్డ్ కప్(World Cup 2023 )లో బరిలోకి దిగనుంది. ఈరోజు న్యూజిలాండ్ క్రికెట్ నలుపు రంగు, తెల్లని నిలువు గీతలతో ఉన్న కొత్త జెర్సీ(New Jersey)ని విడుదల చేసింది. వైస్ కెప్టెన్ టామ్ లాథమ్(Tam Latham), స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(Trent Boult), లూకీ ఫెర్గూసన్(Lockie Ferguson)లు లేటెస్ట్ జెర్సీ ధరించి ఫొటోలకు పోజిచ్చారు. ప్రస్తుతం కివీస్ కొత్త జెర్సీ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. జెర్సీ చాలా స్పెషల్‌గా ఉందటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇంగ్లండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్(Newzealand) మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే బంగ్లాదేశ్ గడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దాంతో, న్యూజిలాండ్ క్రికెట్ ఈ రోజు 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలిమయ్సన్(Kane Williamson), వైస్ కెప్టెన్ టామ్ లాథమ్(Tom Latham) అందుబాటులో లేకపోవడంతో లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson)కు సారథిగా బాధ్యతలు అప్పగించింది.
Our @cricketworldcup shirt is here!
Available | https://t.co/KYeMEalVLI#BACKTHEBLACKCAPS #CWC23 pic.twitter.com/hzYjjlmLIm
— BLACKCAPS (@BLACKCAPS) September 18, 2023
న్యూజిలాండ్ వరల్డ్ కప్ స్క్వాడ్ : లాకీ ఫెర్గూసన్(కెప్టెన్), ఫిన్ అలెన్, టామ్ బండిల్, ట్రెంట్ బౌల్ట్, చాడ్ బోవ్స్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైలీ జేమిసన్, కోల్ మెక్కాంచీ, ఆడం మిల్నే, హెన్రీ నికోలస్, రచిన్ రవీంద్ర, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.
నాలుగేళ్ల క్రితం ప్రపంచ కప్(ODI World Cup 2019) ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ అనూహ్యంగా టైటిల్ చేజార్చుకుంది. బెన్ స్టోక్స్(Ben Stokes), జోఫ్రా ఆర్చర్(Jofra Archer) అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ కప్పు ఎగరేసుకపోయింది. దాంతో, కివీస్ ఈసారి ట్రోఫీ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత గడ్డపై అక్టోబర్ 5న ప్రపంచ కప్ మొదలవ్వనుంది. ఆరంభ పోరులో న్యూజిలాండ్ ఇంగ్లండ్ తలపడనున్నాయి.