Newzealand : వన్డే క్రికెట్లో న్యూజిలాండ్ (Newzealand) జోరు కొనసాగుతోంది. ఈ ఫార్మాట్లో వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న కివీస్ ఈసారి ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసింది. మూడో వన్డేలో 2 వికెట్లతో గెలుపొందిన బ్లాక్‌క్యాప్స్ 42 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తంగా ఆ జట్టుకు వరుసగా ఇది పదో సిరీస్ విజయం. 2019లో టీమిండియా చేతిలో ఓటమి తర్వాత నుంచి ఒక్క సిరీస్‌లోనూ కివీస్ ఓడిపోలేదు. అంతేకాదు ఈ పదింటా క్లీన్‌స్వీప్ చేయడం విశేషం.
వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్ జట్టు తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా ఆడే కివీస్ ద్వైపాక్షిక సిరీస్‌లలో చెలరేగిపోతోంది. ఆరేళ్ల క్రితం భారత జట్టు చేతిలో సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఆపై అన్నింటా విజయభేరి మోగిస్తోంది. ఇటీవలే పాకిస్థాన్‌పై సిరీస్ పట్టేసిన కివీస్… ఇప్పుడు ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడో వన్డేలో బ్లెయిర్ టిక్నర్ విజృంభణతో ఇంగ్లండ్ 222 పరుగులకే ఆలౌటయ్యింది.
10 consecutive ODI series wins for New Zealand 🔥 🏆
They haven’t been beaten since losing to India in Jan-Feb 2019 pic.twitter.com/on0b0PTArn
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2025
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 44.4 ఓవర్లలో ఛేదించిన సాంట్నర్ సేన పర్యాటక జట్టును వైట్‌వాష్ చేసింది. తద్వారా రికార్డు స్థాయిలో 10వ సారి ట్రోఫీని ఒడిసిపట్టుకుంది. యాభై ఓవర్ల ఫార్మాట్లో ఆ జట్టు ఎంత బలంగా ఉందో అర్ధమవుతోంది. మూడు మ్యాచుల్లో దంచేసిన డారిల్ మిచెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా, నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివరిచిన బ్లెయిర్ టిక్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యారు.
What’s going wrong with England in ODIs? 📉 pic.twitter.com/vosyLyCGzm
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2025
ఇంగ్లండ్ విషయానికొస్తే.. గత కొంతకాలంగా ఆ జట్టు ఆట అధ్వాన్నంగా మారింది. 2019లో తొలిసారి వన్డే ఛాంపియన్‌గా అవతరించిన ఆ జట్టు పతనం కొనసాగుతోంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. దుబాయ్ వేదికగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పుడు కివీస్ బౌలర్లను ఎదుర్కోలేక 42 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది.