Womens World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్‌ను ఓటమితో ప్రారంభించిన న్యూజిలాండ్‌కు మరో షాక్. రెండో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న ఆల్‌రౌండర్ ఫ్లోరా డెవాన్‌షైర్ (Flora Devonshire) అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం నెట్స్‌లో సాధన సమయంలో ఫ్లోరా గాయపడింది. ఫీల్డింగ్ చేస్తుండగా ఈ యంగ్‌స్టర్ ఎడమ చేయికి బలమైన గాయమైంది. ఆమెను పరీక్షించిన వైద్యులు కోలుకునేందుకు కనీసం రెండు నుంచి మూడు వారాలు సమయం పడుతుందని తెలిపారు. దాంతో.. ఫ్లోరా స్థానంలో సీనియర్ క్రికెటర్ హన్నా రొవే (Hannah Rowe))ను ఎంపిక చేశారు సెలెక్టర్లు.
నిరుడు టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ అయిన న్యూజిలాండ్ వన్డే వరల్డ్ కప్‌ను పట్టేయాలనే లక్ష్యంతో భారత్‌కు వచ్చింది. కానీ, తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా చేతిలో 89 పరుగుల తేడాతో వైట్ ఫెర్న్స్ ఓటమి చవిచూసింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఆల్‌రౌండర్ ఫ్లోరా గాయపడడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. ఆమె స్థానంలో స్క్వాడ్‌లోకి వచ్చిన మాత్ హన్నా రొవేకు ఇది మూడో వరల్డ్ కప్. పేస్ ఆల్‌రౌండర్ అయిన ఆమెకు 60 వన్డేలు ఆడిన అనుభవం ఉంది.
Full story | https://t.co/Hzs2WAUFit #CWC25 pic.twitter.com/A2n1GJhBIG
— WHITE FERNS (@WHITE_FERNS) October 4, 2025
‘మేమందరం ఫ్లోరా వైదొలగడంతో చాలాబాధ పడుతున్నాం. తను వరల్డ్ కప్ ఆడడం కోసం చాలా కష్టపడింది. అవకాశం లభించిందనే సంతోషంలో ఉన్న తను గాయపడడంతో ఆరంభంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది’ అని హెడ్‌కోచ్ బెన్ సాయెర్ వెల్లడించింది.
🚨 A hand injury has ruled Flora Devonshire out of the Women’s World Cup 2025!
Hannah Rowe to link up with the squad next week.🏏#CricketTwitter #CWC25 pic.twitter.com/dTVNHkHfeq
— Female Cricket (@imfemalecricket) October 4, 2025
న్యూజిలాండ్ స్క్వాడ్ : సోఫీ డెవినె(కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, హన్నా రొవే, ఇజీ గాజే, మ్యాడీ గ్రీన్, బ్రూకే హల్లిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, బెల్లా జేమ్స్, మేలీ కేర్, జెస్ కేర్, రోస్మెరీ మేర్, జార్జియా ప్లిమ్మెర్, లీ తహుహ.