NZ vs BAN : బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్(Newzealand) జట్టు బ్యాటర్లు తేలిపోయారు. బంగ్లా పేసర్లు చెలరేగడంతో కివీస్ 254 పరుగులకే ఆలౌటయ్యింది. పర్యాటక జట్టులో టామ్ బండిల్(68), హెన్రీ నికోలస్(49) మాత్రమే రాణించారు. ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ మరో నాలుగు బంతులు ఉండగానే కివీస్ కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్(Khaled Ahmed), మహెదీ హసన్(Mahedi Hasan) మూడేసి వికెట్లు పడగొట్టారు.
Dutch Bangla Bank Cricket Series 2023
Bangladesh 🆚 New Zealand | 2ndODI 🏏Bangladesh need 255 Runs to Win
Full Match Details: https://t.co/z51nYIFZM7
Watch the Match Live on Gazi TV, T-Sports & Rabbithole
#BCB | #Cricket | #BANvNZ pic.twitter.com/Eb1gImPLma
— Bangladesh Cricket (@BCBtigers) September 23, 2023
వరల్డ్ కప్(ODI World Cup 2023) సన్నద్ధత కోసం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్లో తలపడుతున్నాయి. అయితే.. ఇరుజట్ల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 33.4వ ఓవర్ సమయంలో వద్ద మొదలైన వాన ఎంతకూ తగ్గలేదు. దాంతో, మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది. అందుకని సిరీస్లో కీలకమైన రెండో వన్డేలో కివీస్, బంగ్లా విజయంపై కన్నేశాయి.