హరారే: జింబాబ్వే ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు టీ20 సిరీస్ను న్యూజిలాండ్ జట్టు గెలుచుకుంది. శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా హోరాహోరీగా ముగిసిన ఫైనల్లో కివీస్.. 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత ఓవర్లలో 180/5 పరుగులు చేసింది. రచిన్ (47), కాన్వే (47) రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు 177/6 వద్దే ఆగిపోయింది. 19 ఓవర్లకు ఆ జట్టు విజయానికి ఆరు బంతుల్లో ఏడు పరుగులు అవసరం కాగా.. మాథ్యూ హెన్రీ ఆఖరి ఓవర్లో బ్రెవిస్ (31), లిండె (10) వికెట్లు తీయడమే గాక 3 పరుగులే ఇవ్వడం విశేషం.