సిల్హెట్(బంగ్లాదేశ్): బంగ్లాదేశ్తో మంగళవారం మొదలైన తొలి టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్(4/37) నాలుగు వికెట్లతో విజృంభించాడు. తొలుత టాస్ గెలిచిన బంగ్లా..బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ హసన్జాయ్(86) మెరుగైన శుభారంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ జకీర్ హసన్(12) నిరాశపరిచినా..హసన్ జట్టును ముందుండి నడిపించాడు.
కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్లో 11 ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అయితే స్పిన్నర్ ఫిలిప్స్ రంగప్రవేశంతో బంగ్లా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఫిలిప్స్ చెలరేగడంతో బంగ్లా వరుస వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 310 పరుగులు చేసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తైజుల్, షరీఫుల్ క్రీజులో ఉన్నారు.