Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Sai Durga Tej | మెగా సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్ వరుసగా విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
Sai Durga Tej | మెగా సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్ వరుసగా విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. దర్శకుడు తేజ కాకుమాను తెరకెక్కించనున్న ఈ సినిమాను నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాయిదుర్గా తేజ్, తేజ కాకుమాను కాంబినేషన్లో రానున్న ఈ కొత్త సినిమా కథాంశంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అయితే షూటింగ్ ప్రారంభ తేదీ, కథాంశానికి సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్‌కు జోడీగా కన్నడ నటి సప్తమి గౌడ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. సప్తమి గౌడ గతంలో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలాగే హిందీ చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’లోనూ నటించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సాయిదుర్గా తేజ్ సరసన అవకాశం వస్తే, అది ఆమె కెరీర్‌కు మరో ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.
మరోవైపు సాయిదుర్గా తేజ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’పై కూడా అంచనాలు ఉన్నాయి. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్ ‘బలి’ అనే పోరాట యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘విరూపాక్ష’ తర్వాత సాయిదుర్గా తేజ్, సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ మరోసారి ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

