Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Allari Subhashini | ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన మాటలతో ప్రేక్షకులను నవ్వించడమే కాదు.. సేవా కార్యక్రమాలతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు.
Allari Subhashini | ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన మాటలతో ప్రేక్షకులను నవ్వించడమే కాదు.. సేవా కార్యక్రమాలతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. తాజాగా ‘ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్’ ఐదో వార్షికోత్సవ వేడుకల్లో సుమ చేసిన సేవలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ముఖ్యంగా నటి అల్లరి సుభాషిణి తన జీవితంలో సుమ పోషించిన పాత్రను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంటున్న అల్లరి సుభాషిణి.. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేక, కనీసం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు సుమ తనకు అండగా నిలిచారని వెల్లడించారు. ఆ సమయంలో సుమ అందించిన సహాయం వల్లే తాను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని భావోద్వేగంతో చెప్పారు.
సుమ నా ప్రాణదాత. సుమ ద్వారా నాకు సహాయం అందించిన దాతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇలా నిలబడి ఉన్నానంటే సుమే కారణం అంటూ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన కష్టకాలంలో సుమ అందించిన తోడ్పాటును ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో సుమ వెంటనే స్పందించి సహాయం పంపేవారని సుభాషిణి గుర్తుచేసుకున్నారు. సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల కూడా తనకు ఎంతో అండగా నిలిచారని చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు తమకు తోడుగా నిలిచిన వారిని జీవితాంతం గుర్తుంచుకోవాలని ఆమె మాటలు తెలియజేశాయి.
సుమ ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సుభాషిణి తెలిపారు. ఆమెతో పాటు రాజీవ్ కనకాల, వారి పిల్లలు కూడా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేకాదు, “మళ్లీ జన్మంటూ ఉంటే సుమ లాంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నాను” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. కాగా, అల్లరి సుభాషిణి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినవారు. చిన్న వయసులోనే నాటకరంగంలోకి అడుగుపెట్టిన ఆమె ‘చింతామణి’ వంటి పలు నాటకాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. రవిబాబు దర్శకత్వంలో 2002లో విడుదలైన ‘అల్లరి’ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ‘అల్లరి సుభాషిణి’గా పేరు స్థిరపడిపోయింది. అనంతరం ఈవీవీ సత్యనారాయణ, కృష్ణవంశీ వంటి ప్రముఖ దర్శకుల సినిమాల్లో నటించే అవకాశాలు అందుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

