టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 172 పరుగులు చేసి.. ఆస్ట్రేలియాకు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. న్యూజిలాండ్‌ను కెప్టెన్ విలియమ్సన్ ఆదుకున్నాడు. చెలరేగిపోయాడు. 10 ఓవర్ల వరకు స్వల్ప స్కోర్‌కే పరిమితం అయిన న్యూజిలాండ్.. 10 ఓవర్లు దాటాక స్కోర్‌ను అమాంతం పెంచేసింది.
విలియమ్సన్.. వరుసగా ఫోర్లు, సిక్సులు బాది స్కోర్‌ను అమాంతం పెంచేశాడు. విలియమ్సన్.. 48 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు.
న్యూజిలాండ్ ఓపెనర్లు గప్టిల్ 35 బంతుల్లో 28, మిచెల్ 8 బంతుల్లో 11 పరుగులు చేశారు. ఫిలిప్స్ 17 బంతుల్లో 18, నీషమ్ 7 బంతుల్లో 13, టిమ్ 6 బంతుల్లో 8 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో హజిల్‌వుడ్ 3 వికెట్లు తీశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 16 పరుగులే ఇచ్చాడు. ఆడమ్ జంపా కూడా 4 ఓవర్లు వేసి కేవలం 26 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. స్టార్క్ మాత్రం 4 ఓవర్లు వేసి.. ఏకంగా 60 పరుగులు అందించాడు. మ్యాక్స్‌వెల్ 3 ఓవర్లలో 28 పరుగులు, కమిన్స్.. 4 ఓవర్లలో 27 పరుగులు, మార్ష్ ఒక ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు.
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.
A Kane Williamson masterclass helps New Zealand to 172/4.
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021
Can they defend this and lift the 🏆? #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/1HyoPN4N0d pic.twitter.com/kZROWZ2N3Q
The joint-highest score in a #T20WorldCupFinal from Kane Williamson 🔢
— ICC (@ICC) November 14, 2021
A knock for the ages 👏#T20WorldCup | #NZvAUS | https://t.co/50horpfG97 pic.twitter.com/FJdWmod5TK