New Zealand | దుబాయ్: భారత్‌తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరుకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తప్పేట్టు లేదు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడి (10)గా ఉన్న మాథ్యూ హెన్రీ ఫైనల్లో ఆడటం అనుమానంగానే మారింది. దక్షిణాఫ్రికాతో రెండో సెమీస్ సందర్భంగా అతడు క్యాచ్ పడుతుండగా భుజానికి గాయమైంది.
వైద్య పరీక్షల అనంతరం అతడు ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమేనని కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు. లీగ్ దశలో భారత్‌తో ఆడిన మ్యాచ్‌లో హెన్రీ.. ఐదు వికెట్లు (5/42) పడగొట్టి టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసిన విషయం విదితమే.