నెల్సన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. మొదట బంగ్లా 49.5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సౌమ్య సర్కార్ (169) భారీ సెంచరీతో చెలరేగాడు. అనంతరం న్యూజిలాండ్ 46.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. నికోల్స్ (95), యాంగ్ (89), రచిన్ రవీంద్ర (45) సత్తాచాటారు.