లవాయో(జింబాబ్వే) : న్యూజిలాండ్ తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 359 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 476 పరుగుల లోటుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన జింబాబ్వే..28.1 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది. అరంగేట్రం బౌలర్ జాక్రె ఫౌల్క్స్(5/37) ధాటికి నిక్ వెల్ష్(47 నాటౌట్) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఫౌల్క్స్ విజృంభణతో జింబాబ్వే బ్యాటర్లు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు.
ఆడుతున్నది తొలి టెస్టు అయిన మెరుగైన పరిణతి కనబరిచిన ఫౌల్క్స్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 9/75 ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో విల్ రూర్కీ(9/93) పేరిట ఉన్న రికార్డును జాక్రె అధిగమించాడు. కివీస్ బౌలర్ల విజృంభణతో తొమ్మిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 601/3 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. కాన్వెకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, 16 వికెట్లు పడగొట్టిన మ్యాట్ హెన్రీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.