తరౌబా: తొలిసారి టీ20 వరల్డ్ కప్ సూపర్-8 చేరకుండానే నిష్క్రమించిన న్యూజిలాండ్‌కు ఓదార్పు విజయం దక్కింది. గ్రూప్ ‘సీ’ లో తరౌబా వేదికగా ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 9 వికెట్ల తేడా తో ఘనవిజయ ం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉగాండా.. న్యూజిలాండ్ బౌలర్లు టిమ్ సౌథీ (3/4), బౌల్ట్ (2/7) శాంట్నర్ (2/8) ధాటికి 18.4 ఓవర్లలో 40 పరుగులకే చాప చుట్టేసింది. కెన్నెత్ (11) ఒక్కడే రెండంకెల స్కోరు చేశాడు. ఛేదనను కివీస్.. 5.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. సౌథీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. మ్యాచ్ ముగిశాక కివీస్ దిగ్గజ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఇదే తన చివరి ప్రపంచకప్ అని చెప్పడం గమనార్హం.