ముంబై: న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) రెండో టెస్టు దూరం కానున్నాడు. పుణెలో జరిగే ఆ టెస్టుకు అతను అందుబాటులో ఉండడం లేదని కివీస్ యాజమాన్యం ప్రకటించింది. గాయం వల్ల అతను ఇప్పటికే ఫస్ట్ టెస్టులో ఆడలేదు. గజ్జల్లో నొప్పి వల్ల అతను ఫస్ట్ టెస్టుకు అందుబాటులో లేడు. అయితే ఇంకా ఆ నొప్పి తగ్గని కారణంగా.. అతను రెండో టెస్టుకు కూడా దూరం అవుతున్నట్లు కివీస్ క్రికెట్ ప్రకటించింది. టెస్టు వరల్డ్ చాంపియన్షిప్లో భాగంగా గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. రిహాబిలిటేషన్లో విలియమ్సన్ కోలుకుంటున్నాడని కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు. గురువారం నుంచి జరిగే పుణె టెస్టుకు అతను అందుబాటులో ఉండడని, నవంబర్ ఒకటో తేదీ నుంచి ముంబైలో జరిగే మూడో టెస్టు అందుబాటులో ఉండేది డౌటే అని తెలిపాడు.