న్యూయార్క్: న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అల్లెన్(Finn Allen).. దుమ్మురేపాడు. అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో సెంచరీతో కదం తొక్కాడు. టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఓక్లాండ్ కొలేసియం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో తరపున ఫిన్ అలెన్ ఆడాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 51 బంతుల్లో 151 రన్స్ చేశాడు. 296 స్ట్రయిక్ రేట్‌తో అతను బ్యాటింగ్ చేశాడు. అల్లెన్ ఇన్నింగ్స్‌లో అయిదు ఫోర్లు, 19 సిక్సర్లు ఉన్నాయి.
ఈ ఇన్నింగ్స్‌తో అల్లెన్ టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ 150 చేశాడు. కేవలం 49 బంతుల్లో అతను మైలురాయి అందుకున్నాడు. 34 బంతుల్లోనే సెంచరీ బాదాడు. టీ20లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన తొలి కివీస్ బ్యాటర్‌గా నిలిచాడతను. టోర్నమెంట్ చరిత్రలో ఫాస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ అయ్యాడు. తాజా ఇన్నింగ్స్‌లో క్రిస్ గేల్‌తో పాటు సాహిల్ చౌహాన్ రికార్డులను అతను బ్రేక్ చేశాడు. టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో గతంలో గేల్, చౌహాన్లు అత్యధికంగా 18 సిక్సర్లు బాదారు. ఫిన్ అల్లెన్ ఈ మ్యాచ్‌లో 19 సిక్సర్లు కొట్టి ఆ రికార్డును తుడిచేశాడు.
వాస్తవానికి ఆరు నెలల క్రితం ఫిన్ అల్లెన్‌కు ఐపీఎల్ వేలంలో చుదు అనుభవం ఎదురైంది. అల్లెన్ను ఒక్క ఐపీఎల్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రెండు కోట్ల బేస్ ప్రైజ్‌తో అతను వేలానికి సిద్ధంగా ఉండే. కానీ అతను అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
Finn Allen’s out here breaking records 💯 He smashed the fastest century in MLC history for the @SFOUnicorns! 🔥 pic.twitter.com/SVyQ9n99Rf
— Cognizant Major League Cricket (@MLCricket) June 13, 2025