Euro 2024 : ప్రతిష్ఠాత్మక యూరో 2024 చాంపియన్‌షిప్(Euro 2024 championship) క్వాలిఫికేషన్ ఆసక్తికరంగా నడుస్తోంది. జర్మనీ ఆతిథ్యం ఇస్తున్న ఈ పోటీలకు నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, రొమేనియా క్వాలిఫై అయ్యాయి. మరోమ్యాచ్‌లో ఫ్రాన్స్ రికార్డు స్థాయిలో 14-0 గోల్స్‌తో గిబ్రల్టర్ను చిత్తు చేసింది.
గెలవక తప్పని మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై నెదర్లాండ్స్ అదరగొట్టింది. వాట్ వెగొర్స్ట్ 12వ నిమిషంలో అద్భుత గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆతర్వాత 18 సార్లు నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఐర్లాండ్ గోల్ పొస్ట్‌పై దాడి చేశారు. కానీ, ఒక్క గోల్ కొట్టలేకపోయారు. మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ కొసోవో జట్టుపై 1-1తో డ్రా చేసుకొని యూరో 2024 చాంపియన్‌షిప్ పోటీలకు క్వాలిఫై అయింది. 2012 తర్వాత ఆ జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఇజ్రాయేల్‌పై అదరగొట్టిన రొమేనియా 2-1తో గెలుపొంది యూరో 2024 బెర్తు దక్కించుకుంది.
వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో రఫ్ఫాడించిన కిలియన్ ఎంబాపే మరోసారి మెరిశాడు. గిబ్రల్టర్ జట్టుపై హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టు ఆధిక్యాన్ని అమాంతం పెంచాడు. అతడి స్ఫూర్తితో ఇతర ఆటగాళ్లు 9 గొల్స్‌తో గిబ్రల్టర్పై విరుచుకుపడ్డారు. దాంతో, ఫ్రాన్స్ రికార్డు స్థాయిలో 14 గోల్స్‌తో గెలుపొందింది.