బార్బడోస్: నేపాలీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సందీప్ లమిచేన్(Sandeep Lamicchane) .. సోమవారం కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో వంద వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి అతను ఆ ఘనతను అందుకున్నాడు. 54వ టీ20 మ్యాచ్ ఆడిన అతను ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో వంద వికెట్లు తీసిన స్పిన్ బౌలర్లలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ ముందున్నాడు. అతను కేవలం 53 మ్యాచుల్లోనే ఆ రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
రేప్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న లమిచేన్.. ఏడాది కాలం నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే వరల్డ్‌కప్ టోర్నీలో అతను దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనే ఎంట్రీ ఇచ్చాడు. అత్యాచార కేసులో అతనికి 8 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఏడాది కాలం నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న లమిచేన్.. కాఠ్మాండూలోని టీయూ గ్రౌండ్లో రెగ్యులర్‌గా శిక్షణ పొందుతున్నాడు.
అమెరికా వీసా రాకపోవడం వల్ల లమిచేన్ ప్రయాణం రెండు వారాలు ఆలస్యమైంది. వరల్డ్‌కప్ బృందంలోకి లమిచేన్ను తీసుకునే అవకాశం ఇవ్వాలని నేపాల్ జట్టు ఐసీసీని వేడుకున్నది. దీంతో చివరి రెండు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను ఆడేందుకు లమిచేన్కు అనుమతి ఇచ్చారు. అమెరికా వీసా రావడంలో సహకరించిన నేపాల్ విదేశాంగ, క్రీడా, క్రికెట్ శాఖలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 21 రన్స్ తేడాతో విజయం సాధించి సూపర్ 8 స్టేజ్‌కు క్వాలిఫై అయ్యింది.
🇳🇵 Lamichhane writes history on the world stage! 🏏
Sandeep becomes the second fastest person to reach this milestone and the first Nepali to do so. 🚨
📺 Watch the action live: https://t.co/aAUebD2xvi#OneBallBattles #NepalCricket #T20WorldCup #OutOfThisWorld pic.twitter.com/nNMAh5vrCH
— CAN (@CricketNep) June 17, 2024