Paris Olymipics 2024 : టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన నీరజ్ చోప్రా (Neeraj Chopra)పారిస్‌లోనూ దుమ్మురేపాడు. విశ్వక్రీడల జావెలిన్ త్రో(Javelin Throw) పోటీల్లో వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ ఈటెను 89.34 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలోనే అంత దూరం బడిసెను విసిరి పతకం వేటలో అడుగు ముందుకేశాడు. చోప్రాకు ఇది కెరీర్లోనే రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో మరోసారి అదిరే ప్రదర్శన చేశాడు. నాలుగేండ్ల క్రితం టోక్యోలో (87.58 మీటర్ల) పసిడి పతకంతో ఈ బడిసె వీరుడు చరిత్ర సృష్టించాడు. విశ్వ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొల్లగొట్టిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.
Neeraj Chopra Qualify for the Finals
पहली ही बार मे 89.34 मीटर शानदार 🔥🔥
उड़ा दिया भाला 🎉🎉#Paris2024 #Cheer4Bharat #Olympics #Athletics #NeerajChopra#NeerajChopra #IndiaAtParis24 pic.twitter.com/k6GLNpiFUS— Abhinay Maths (@abhinaymaths) August 6, 2024
ఇప్పుడు పారిస్‌లోనూ నీరజ్ సత్తా చాటాడు. భారత పతకాల సంఖ్య మూడు వద్దే ఆగిపోయన సందర్భంలో కోట్లాది మంది ఆశలను మోస్తున్న అతడు అంచనాలకు తగ్గట్టు రాణించాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో ఈటెను 89.34 మీటర్ల దూరం విసిరాడు. దాంతో, ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి ఫైనల్ బెర్త్ సంపాదించాడు. సాధించాడు.