ఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ నెల 13, 14 తేదీలలో బ్రస్సెల్స్ (బెల్జియం) వేదికగా జరుగబోయే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఈ ఏడాది దోహా, లుసానే డైమండ్ లీగ్స్‌లో పాల్గొని 14 పాయింట్లు సాధించిన నీరజ్.. నాలుగో స్థానంతో తుది పోరులో చోటు దక్కించుకున్నాడు.
ఈ జాబితాలో అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), జులియన్ వెబర్ (జర్మనీ), జాకబ్ వాద్లెచ్ (చెక్) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కాగా ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు.