జూరిచ్: ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra).. జూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. 85.01 మీటర్లు జావెలిన్‌ను విసిరాడు. అయితే జర్మనీ త్రోయర్ జులియన్ వెబర్ ఆ టోర్నీలో టాప్ ప్లేస్ కొట్టేశాడు. అతను తన జావెలిన్‌ను 91.51 మీటర్ల దూరం విసిరాడు. రెండో ప్రయత్నంలోనే అతను ఆ మార్క్ దాటేశాడు. తొలి రెండు ప్రయత్నాల్లోనూ వెబర్ 91 ప్లస్ మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరాడు.
జూరిచ్‌లో నీరజ్ పర్ఫార్మెన్స్ సరిగా సాగలేదు. ఆరంభంలో రెండు సార్లు 80 మీటర్ల దూరం వరకే తన త్రో వేశాడు. ఆ తర్వాత మూడు సార్లు ఫౌల్స్ తో నిరాశకు గురి చేశాడు. అయితే చివరి ప్రయత్నంలో అతను 85 మీటర్ల దూరం విసిరి ఊపిరి పీల్చుకున్నాడు. వరుసగా 26 టోర్నీల్లో నీరజ్ చోప్రా తొలి రెండు స్థానాల్లో నిలవడం గమనార్హం.
2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ట్రినిడాడ్ టొబాగో త్రోయర్ కేషార్న్ వాల్కాట్ 84.95 మీటర్లు విసిరి మూడవ స్థానంలో నిలిచాడు.
Neeraj Chopra’s final throw of 85.01m that just about clinched him a 2nd place to continue his streak of top-two finishes.
🎥 Wanda Diamond League YouTube pic.twitter.com/UmLPDjVuiU
— Vinayakk (@vinayakkm) August 28, 2025