Neeraj vs Nadeem : పారిస్ ఒలింపిక్స్ తర్వాత భారత బడిసె వీరుడు నీరజ్ చోప్రా (Neeraj Chopra), అర్షద్ నదీమ్ (Arshad Nadeem) ఎదురుపడింది లేదు. త్వరలోనే సెలేసియా డైమండ్ లీగ్ (Silesia Diamond League)లో దాయాది అథ్లెట్లు ‘నువ్వానేనా’ అన్నట్టు జావెలిన్‌ను విసురుతారని అభిమానులు అనుకున్నారు. కానీ, నిర్వాహకులు ప్రకటించిన తొలి జాబితాలో ఇద్దరి పేర్లు లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఆగస్టు 16 న సెలిసియా డైమండ్ లీగ్ మొదలవ్వనుంది. టోర్నీకి మరో ఐదు రోజులే ఉండడంతో ఆదివారం నిర్వాహకులు అథ్లెట్ల జాబితాను వెల్లడించారు. అందులో నీరజ్, అర్షద్ల పేర్లు మాత్రం లేవు. జులియన్ వెబర్, జులియస్ ఎగో, అండర్సన్ పీటర్స్ వంటి స్టార్లు బరిలో ఉన్నట్టు ఆర్గనైజర్స్ తెలిపారు. అయితే.. జూలైలోనే ఈ లీగ్ షెడ్యూల్ వచ్చింది. దాంతో.. యూరప్‌లో జరుగబోయే ఈ టోర్నీలో నీరజ్, నదీమ్‌ల మధ్య హోరాహోరీ బడిసె ఫైట్ ఉంటుందని భావించారంతా. కానీ, అధికారిక జాబితాలో చోప్రా పేరు లేకపోవడంతో అతడు ఈ టోర్నీలో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
Neeraj Chopra threw his name deeper into history. 💪
A year ago today, he won 🥈 at Paris 2024, and became the first Indian to win two Olympic medals in track & field. 🤩#OnThisDay pic.twitter.com/xs9OEt8Pvw
— Olympic Khel (@OlympicKhel) August 8, 2025
పాక్ అథ్లెట్ నదీమ్ ఈమధ్యే లండన్‌లో కాలిపిక్క కండరాలకు సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకుంటున్న అతడు ప్రపంచ ఛాంపియన్షిప్స్ మీద దృష్టిసారించాడని అతడి కోచ్ సల్మాన్ భట్ వెల్లడించాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ (NC Classic)లో నదీమ్ పోటీపడలేదు. ఆ తర్వాత 90 మీటర్ల మార్క్ అందుకొని చోప్రా విజేతగా నిలిచిన జరిగిన ‘దోహా డైమండ్ లీగ్’లోనూ నదీమ్ పాల్గొనలేదు.
తలపడేది వీళ్లే.. జులియన్ వెబర్ (జర్మనీ), జులియస్ ఎగో(కెన్యా), రొడ్రిక్ జెన్కీ డీన్ (జపాన్), అండ్రియాన్ మర్దారే(మాల్డోవా), సిప్రియన్ రిజ్గోల్డ్ (పొలాండ్), అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), కెశొర్న్ వాల్కాట్(ట్రినిడాడ్ టొబాగో).