ఢిల్లీ : డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించి ఆటల నుంచి నిషేధం, అనర్హులుగా తేలిన క్రీడాకారుల జాబితాలో భారత్.. కెన్యాను అధిగమించింది. అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్స్ (ఏఐయూ) నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1 నాటికి ఈ జాబితాలో కెన్యా (146)ను భారత్ (148) దాటేసింది.
భారత్ నుంచి ఈ జాబితాలో ఉన్న ప్రముఖ క్రీడాకారుల్లో మహిళల 100 మీటర్ల రన్నర్ ద్యుతీచంద్ (2022లో నాలుగేండ్ల నిషేధం), మిడిల్ డిస్టాన్స్ రన్నర్ పర్వేజ్ ఖాన్ (ఆరేండ్ల నిషేధం- 2030 దాకా), తమిళనాడు స్ప్రింటర్ ధనలక్ష్మీ (8 ఏండ్లు) ఉన్నారు. భారత్, కెన్యా తర్వాత రష్యా (66 మంది) మూడో స్థానంలో నిలిచింది.