Team India | వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్‌ను 2-0 తేడాతో టీం ఇండియా కైవశం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీం ఇండియా ఘన విజయం సాధించింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 178 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో టీం ఇండియా ఎనిమిది పరుగుల తేడాతో మ్యాచ్ గెలుచుకుంది. ఇరు జట్లు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. టీం ఇండియా బౌలర్లలో యజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలుచుకున్న వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. బ్యాటింగ్‌కు దిగిన టీం ఇండియా ప్రారంభంలో రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ పెవిలియన్ బాట పడ్టాడు. వన్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన మాజీ సారధి విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 52 పరుగులుచేశాడు. వాటిలో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. పవర్ ప్లే ముగిసే సరికి టీంఇండియా ఒక వికెట్ కోల్పోయినా 49 పరుగులు చేసింది.
తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టీం ఇండియా సారధి రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టబోయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికే అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లీ ఔటయ్యాడు. చివర్లో వచ్చిన రిషబ్ పంత్ 52, వెంకటేశ్ అయ్యర్ 38 పరుగులు చేశారు. టీం ఇండియా 186 పరుగులు సాధించి, వెస్టిండీస్ ముందు 187 పరుగుల లక్ష్యాన్ని విధించింది.