యష్ ధుల్ ధమాకా
- యువ భారత్ 290/5
- ఆస్ట్రేలియాతో సెమీఫైనల్
- అండర్-19 ప్రపంచకప్
నాయక ద్వయం అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన వేళ.. అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో యువ భారత్ భారీ స్కోరు చేసింది. అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టిన యంగ్‌ఇండియా.. కీలక పోరులోఓపెనర్లు విఫలమైనా.. కెప్టెన్ యష్ ధుల్ సెంచరీ.. వైస్ కెప్టెన్, తెలుగు ఆటగాడు షేక్ రషీద్ హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం కనబర్చింది!
అంటిగ్వా: కెప్టెన్ యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, ఒక సిక్సర్) శతకానికి.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (94; 8 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తోడవడంతో ఆస్ట్రేలియాతో అండర్-19 ప్రపంచకప్‌లో యంగ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ (6), హర్నూర్ సింగ్ (16) ఎక్కువసేపు నిలువలేకపోయినా.. యష్, రషీద్ మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్న ఈ జోడీ.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలో ధుల్ 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. తెలుగు ఆటగాడు షేక్ రషీద్ సెంచరీకి ఆరు పరుగుల దూరంలో కంగారూ ఫీల్డర్ పట్టిన వివాదాస్పద క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ నిస్బెట్, సాజ్మన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరో సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌పై 15 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ 24 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ ఫైనల్‌కు చేరింది.
ఆఖరి ఓవర్లో 27 పరుగులు
ఒక దశలో 241/2తో అత్యంత పటిష్ట స్థితిలో నిలిచిన యంగ్ ఇండియా మరింత భారీ స్కోరు చేసేలా కనిపించినా.. వరుస బంతుల్లో యష్, రషీద్ ఔట్ కావడంతో కాస్త ఇబ్బంది పడింది. రషీద్ కొట్టిన బంతి బౌలర్ చేతికి తాకుతూ నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లోని వికెట్లను గిరాటేయగా.. అప్పటికే పరుగు కోసం ముందుకొచ్చిన యష్ రనౌటయ్యాడు. ఆ మరుసటి బంతికే రషీద్ క్యాచ్ ఔట్‌గా డగౌట్ బాట పట్టాడు. దీంతో 49 ఓవర్లు ముగిసేసరికి యంగ్‌ఇండియా 263/5తో నిలిచింది. ఇక్కడి నుంచి మరో పది, పదిహేను పరుగులు చేస్తుందేమో అనుకుంటే.. దినేశ్ (4 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నిశాంత్ (12 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఏకంగా 27 పరుగులు పిండుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

