హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణకు చెందిన ప్రముఖ రేసింగ్ డ్రైవర్ నవీన్ పులిగిళ్ల వరల్డ్ ర్యాలీ చాంపియన్‌షిప్ 11వ రౌండ్లో ‘ర్యాలీ డెల్ పరాగ్వే‘ డబ్ల్యూఆర్సీ-3 కేటగిరీ రేసుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి ఈ నెల 30 వరకు జరిగే ఈ రేస్‌లో డ్యూరాన్ రేసింగ్ తరఫున ఫోర్డ్ ఫియెస్టా ర్యాలీ-3 కారులో తన తోటి డ్రైవర్ ముసా షరీఫ్‌తో కలిసి బరిలోకి దిగుతున్నాడు.
ఇటీవల రవాండా మౌంటైన్ గొరిల్లా ర్యాలీలో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న ఈ జోడీ సవాల్‌తో కూడిన 357.64 కిలోమీటర్ల సుదీర్ఘ ఎర్రమట్టి రేసింగ్ ట్రాక్‌పై విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రేసు ముగిసిన వెంటనే చిలీలో జరిగే తదుపరి డబ్ల్యూఆర్సీ రౌండ్లోనూ పాల్గొననుంది. గతంలో 2025 సౌదీ అరేబియా ర్యాలీ విభాగంలో రన్నరప్‌గా నిలిచి డబ్ల్యూఆర్‌సీలో పోడియం సాధించిన భారత తొలి జోడీగా నవీన్-ముసా రికార్డ్డు సృష్టించారు.