న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. క్రీడల్లో అవినీతికి ఆస్కారం లేకుండా మరింత పారదర్శకత కోసం కఠిన నిబంధనలతో యాక్ట్ తీసుకొచ్చింది.
నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్(ఎన్సీబీ)కు మరింత పటిష్టంగా మారుస్తూ బిల్లులో మార్పులు చేశారు. దీని ద్వారా ఇక నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ క్రీడాసంఘాలకు తోడు ఒలింపిక్, పారాలింపిక్ కమిటీలు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఎన్ఎస్ఎఫ్) ఈ యాక్ట్ పరిధిలోకి రానున్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారం ఇప్పటి నుంచి నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరుగాల్సి ఉంటుంది.