National Sports Day | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియంలోని ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జ్ఞాపకార్థం హాకీ మ్యాచ్ నిర్వహించారు. సాట్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, సాట్జీ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘క్రీడాభివృద్ధికి రా్రష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. క్రీడారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి నూతన పాలసీతో పాటు యంగ్‌ఇండియా స్పోర్ట్స్యూనిర్సిటీ నెలకొల్పబోతున్నాం’ అని అన్నారు. మరోవైపు ఒలింపియన్లు నిఖత్జరీన్, ఇషాసింగ్‌కు రూ.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.