హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ మహిళల కబడ్డీ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా టోర్నీ జరుగనుంది. ఇందులో మొత్తం 30 జట్లు పోటీపడుతున్నాయి. టోర్నీకి సంబంధించిన బ్రౌచర్‌ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
జాతీయ కబడ్డీ టోర్నీ నిర్వహణకు పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షు కాసాని వీరేశ్, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, భారత కబడ్డీ కోచ్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 28, 29న లీగ్ మ్యాచ్‌లు, 30న నాకౌట్, ఫైనల్ జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.