
హనుమకొండ: స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వీల్‌చైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి దివ్యాంగుల టీ20 టోర్నీ సోమవారం ప్రారంభమైంది. ఆంధ్రతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తెలంగాణ టోర్నీలో శుభారంభం చేసింది. ఆంధ్ర, రాజస్థాన్ జట్ల మధ్య మరో మ్యాచ్ జరుగాల్సి ఉన్నా..వెలుతురులేమి కారణంగా నిలిపివేశారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోైస్థెర్యం అంగవైకల్యాన్ని జయిస్తుందని దివ్యాంగులు నిరూపించారన్నారు. వీల్‌చైర్ క్రికెట్ టోర్నీలో జట్లకు కిట్లు సమకూర్చిన మంత్రి కేటీఆర్‌కు వినయ్‌భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని హనుమకొండ వేదికగా దివ్యాంగుల జాతీయ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులతో కలిసి క్రికెట్ ఆడటం సంతోషంగా ఉందన్నారు.