హైదరాబాద్, ఆట ప్రతినిధి: రెండు దశాబ్దాల తర్వాత జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌సిప్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జీవితకాల అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గురువారం నుంచి నాలుగు రోజుల పాటు పోటీలు జరుగుతాయని తెలిపారు. దేశంలోని 20 రాష్ర్టాల నుంచి నాలుగు వేల మంది ప్లేయర్లు బరిలో దిగుతున్నారని వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. లాంగ్‌జంప్, హైజంప్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో, స్ప్రింట్, హర్డిల్స్, లాంగ్ డిస్టెన్స్ పోటీలను 30 నుంచి 70పై బడిన వయసు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుకుమార్, రాజేశ్వరి, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.