హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన 4వ జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పారా ప్లేయర్ ముడావత్ బాలాజీ పసిడి పతకంతో మెరువగా, సాయి ప్రభాత్ రజతం సొంతం చేసుకున్నాడు. బాలుర అండర్-21 -67కేజీల కుమిటి విభాగంలో జనిత్ కాంస్య ఖాతాలో వేసుకున్నాడు.
పోటీలకు ఆఖరి రోజైన శనివారం ముగింపు కార్యక్రమానికి జాతీయ కరాటే అసోసియేషన్(కేఐవో) ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ హాజరయ్యారు. 2027 ఆసియా కరాటే చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. వేర్వేరు విభాగాల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా ఓవరాల్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నాయి.