హైదరాబాద్, ఆట ప్రతినిధి : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా 4వ కియో జాతీయ కరాటే చాంపియన్‌షిప్ హోరాహోరీగా సాగుతున్నది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ప్లేయర్లు వేర్వేరు విభాగాల్లో తమ అద్భుత ప్రదర్శనను కనబరుస్తున్నారు. పోటీలకు మూడో రోజైన శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్తాచాటిన ప్లేయర్లకు వీరు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్ని వయసుల వారికి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. వాటిని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీబాలదేవి, స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు.