డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. సోమవారం తెలంగాణ పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ కాంస్య పతకం దక్కించుకుంది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల్ పోరులో స్వర్ణేందు చౌదరీ, మహమ్మద్ అలీ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్‌తో కూడిన తెలంగాణ టీమ్ 0-3తో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో స్వర్ణేందు 1-3తో చిన్మయ చేతిలో ఓడగా, అలీ 0-3తో రీగన్ అల్బుకెర్పై, స్నేహిత్ 0-3తో జశ్ మోదీపై ఓటమిపాలయ్యారు.
అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో తెలంగాణ 3-2తో ఉత్తరప్రదేశ్‌పై గెలిచింది. మిగతా ఈవెంట్ల విషయానికొస్తే..మహిళల 200మీటర్ల రేసులో నిత్యగాదె ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో నిశిక అగర్వాల్, సురభి ప్రసన్న తుదిపోరులో నిలిచారు. మహిళల నెట్‌బాల్‌లో తెలంగాణ టీమ్ 23-18తో ఉత్తరాఖండ్‌పై గెలిచింది. జూడోలో రమ్య(48కి), అలేఖ్య(57కి) ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు.