న్యూఢిల్లీ: జాతీయ బాక్సింగ్ టోర్నీకి వేళయైంది. ఆదివారం నుంచి ఎలైట్ మహిళల, పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్ మొదలుకానుంది. ఈ టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 600 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్జరీన్తో పాటు టోక్యో(2020) ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై, పూజారాణి, పర్వీన్, మీనాక్షి, నీతూ గంగాస్, ప్రీతి పవార్ బరిలో దిగనున్నారు.
మరోవైపు వరల్డ్బాక్సింగ్ కప్ ఫైనల్స్ స్వర్ణ విజేత హితేశ్, సచిన్, అభినాశ్ జమ్వాల్, నరేందర్ బెర్వాల్, అమిత్ పంగాల్ తమ పంచ్ పవర్ ఏంటో రుచిచూపెట్టనున్నారు. ఇటీవల జరిగిన వరల్డ్ బాక్సింగ్ టోర్నీలో పోటీపడ్డ బాక్సర్లు నేరుగా అర్హత సాధించగా, ఒక్కో అసోసియేషన్ నుంచి 10 మంది పురుష, 10 మంది మహిళా బాక్సర్లకు అవకాశం కల్పించారు.